Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లతో పేదల కళ్ళల్లో ఆనందం 

ఇందిరమ్మ ఇండ్లతో పేదల కళ్ళల్లో ఆనందం 

- Advertisement -

కాంగ్రేస్ పేదల పక్షం : ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ 
నవతెలంగాణ – దర్పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బల్ రాజ్ హర్షం వక్తం చేశారు. బుధవారం మండలంలోని డీబి తండాలోని నేనావత్ బుజ్జి -స్వామి లకు ప్రభుత్వం మంజూరు చేసిన నివాసపు గృహ నిర్మాణం పూర్తైంది. ఈ క్రమంలో గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలకు సొంత ఇంటి కళ  సాకారం కావడం కాంగ్రేస్ పార్టీ వల్లనే సాధ్యమైయిందని అన్నారు. ప్రజలు తీసుకున్న మంచి నిర్ణయంతో రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ పాలన చేపట్టి పేదల కొరకు అండగా నిలబడుతుందని అన్నారు. దీని వల్ల నేడు రాష్ట్రంలో లక్షల మంది ఇండ్లు కట్టుకునే భాగ్యం కలిగిందని అన్నారు. కార్యక్రమములో జిల్లా కాంగ్రేస్ యూత్ జనరల్ సెక్రెట్రి సురేందర్, మండల యూత్ అధ్యక్షుడు రిక్క దినకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -