కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామం వార్డ్ నెంబర్ 1 లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవట్ చేసీ ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల కోసం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 5 లక్షలతో నిర్మించే ఈ పథకం ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని అన్నారు. అడ్లూర్ గ్రామానికి చెందిన గండ్ల హేమలత కు ఇందిరమ్మ పథకం క్రింద తనకున్న 575 స్క్వేర్ ఫీట్ లలో ఇంటి స్థలంలో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. తన భర్త మరణించాడని, తన ఇద్దరు కొడుకులతో బీడీలు తయారు చేస్తూ పిల్లలను చదివిస్తున్నానని, తనకు ప్రభుత్వం నుండి ఇండ్ల నిర్మాణానికి మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. తొలుత భూమి పూజ చేసి మంజూరు ఉత్తర్వులు కలెక్టర్ అందజేశారు. పేద వర్గాల కోసం ప్రభుత్వం ఆసరా కల్పిస్తున్నాడని తెలిపారు. అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. తొందరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని, బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకున్న తర్వాత ప్రభుత్వం ఒక లక్ష తొలి విడతగా అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, హౌసింగ్ పిడి జైపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES