Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్నిబంధన మేరకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి 

నిబంధన మేరకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి 

- Advertisement -
  • – మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు 
    నవతెలంగాణ- పరకాల 
  • ప్రభుత్వ నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని పరకాల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వివిధ అధికారులతో కలిసి  కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మించేలా క్షేత్ర పరిశీలకులు చర్యలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణ అవసరాలకు కొనుగోలు చేసే మెటీరియల్ ధరలు కేటాయించిన బడ్జెట్లో కొనుగోలు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

అధికారులు గృహ నిర్మాణ లబ్ధిదారులకు 

కేటాయించిన అధికారులు అవగాహన కల్పించి సకాలంలో ఇందిరమ్మ గృహా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారి వినోద్ కుమార్, హౌసింగ్ ఏఈ ఆకాంక్ష, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -