Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేలా ప్రోత్సహించాలి: డిఈ సుభాష్ 

ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేలా ప్రోత్సహించాలి: డిఈ సుభాష్ 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రోత్సహించాలని స్థానిక అధికారులకు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులకు డి ఈ సుభాష్ సూచించారు. గురువారం మండలంలోని రెడ్డి పేట లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇంటికి ఇసుక కావాల్సిన లబ్దదారులు ట్రాక్టర్ నెంబర్ తో , కూలీలను ఏర్పాటు చేసుకొని తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005995991, ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్, ఏఈ సుచరిత, పంచాయతీ కార్యదర్శి నరేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -