ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకే ఇవ్వాలి: సీపీఐ(ఎం)
- చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
- నవతెలంగాణ – చండూరు
- ఇందిరమ్మ ఇండ్లు భూమిలేని నిరుపేదలకు ఇవ్వాలని సీపీఐ(ఎం) చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరిండం డిప్యూటీ తాసిల్దార్ నిర్మల దేవి కి మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా నేర్మట గ్రామంలోఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారుగా200 మంది దరఖాస్తు చేసుకున్నారని, కొంతమందికి మాత్రమే నిరుపేదలను గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేస్తున్నారని, మిగతా నిరుపేదలను తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని మిగతా గ్రామాల్లో కూడా నిరుపేదల ను గుర్తించి వారికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు రూ.6000 వేలు, రూ.2000 పింఛన్ ఉన్నోళ్లకు రూ. 4000 ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి,నారపాక శంకర్, ఈరగట్ల నరసింహ, నారపాక నరసింహ,శంకర్, మల్లయ్య, బొమ్మ గోని యాదయ్య, శ్రీహరి, యాదయ్య, రమేష్,నారపాక అండాలు, మనోహర్, లింగమ్మ, ముత్తమ్మ, లక్ష్మమ్మ, సోనగోని లక్ష్మమ్మ, సరిత, నారపాక యాదమ్మ, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisment -