Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

- Advertisement -

రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఆగబోవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కనుగుణంగా ఇండ్ల నిర్మాణాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలోని తన చాంబర్‌లో విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిలో మాట్లాడారు. ఇండ్ల నిర్మాణ నిధుల కోసం తాము కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడలేదని చెప్పారు. కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తున్నదని విమర్శించారు. ఒక్కొక్క ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.52 లక్షలు మాత్రమే కేంద్రం ఇస్తున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.5 లక్షలు కేటాయించిందని తెలిపారు. కేంద్రం సూచించిన రీ సర్వే తుది దశలో ఉందని చెప్పారు. వాస్తవానికి లబ్దిదారుల ఎంపికలో కేంద్ర నిబంధనల కంటే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలే పకడ్బందీగా ఉన్నాయని చెప్పారు. ఇండ్ల నిర్మాణ పనులు ఆశించిన స్ధాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ప్లాన్‌ ప్రకారం నిర్మించలేదని తెలిపారు. అవి ఇంకా అసంపూర్తిగా ఉన్నాయనీ, కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శించారు. వీటన్నింటికీ అవసరమైన మరమ్మతులు చేపట్టి లబ్దిదారు లకు కేటాయించబోతున్నామని మంత్రి తెలిపారు. భూభారతికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో ప్రధానంగా సాదాబైనామాలకు సంబందించినవే ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై హైకోర్టు తీర్పురాగానే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంతో ఉపయోగం పుస్తకావిష్కరణలో మంత్రి పొంగులేటి
డిప్యూటీ తహసీల్దార్‌ డాక్టర్‌ పైళ్ల నవీన్‌రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యం’ ఐదవ ఎడిషన్‌ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తన చాంబర్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను ఆయన ఆవిష్కరించారు. మూస పద్దతిని వదిలి సరికొత్త ఆలోచనా విధానంతో ప్రస్తుత పోటీ పరీక్షలకనుగుణంగా పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -