నవతెలంగాణ – ముధోల్
ముధోల్ నియోజకవర్గంలో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీని పగడ్బందీగా మహిళా లబ్ధిదారులకు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే అని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం ముధోల్, బాసర, తానుర్ మండలాలకు చెందిన మహిళ లబ్ధిదారులకు ఐకేపి ఆధ్వర్యంలో చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీరల పంపిణీ పధకం ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో సకాలంలో చీరాలను పంపిణీ చేయాలని సూచించారు. చీరల పంపిణీలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదుగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముధోల్, బాసర , ఎంపిడిఓ లవన్ కూమార్, దేవేందర్ రెడ్డి, ఎపియంలు గురు చరణ్, అశోక్, సులోచన, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, నాయకులు నర్సగౌడ్, సాంవ్లీ రమెష్, ధర్మపురి సుదర్శన్, వెంకళ రావ్, సతీష్ రెడ్డి, తాటివార్ రమెష్, లడ్డు పోతన్న, మహేందర్ రెడ్డి, రాంచందర్, కిష్టయ్య, శ్రీనివాస్, దేవోజీ భుమేష్ , జీవన్ , మహిళలు, తదితరులు పాల్గొన్నారు.



