Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి

నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయాలి

- Advertisement -

ఉపాధి హామీ పనిలో రోజుకు కూలీ రూ.800 ఇవ్వాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ్మ
నవతెలంగాణ – అచ్చంపేట
భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అమ్రాబాద్ మండలంలోని మండల గ్రామంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉపాధి కూలీలు కనీసం 20 రోజులు పనిచేసిన వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చామని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత  ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

అమ్రాబాద్ , కొల్లాపూర్ మండలాలలో గిరిజనులు, గిరిజ నేతరులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు చాలామందికి పట్టాలు ఇవ్వలేదని, వారందరినీ గుర్తించి పట్టాలు ఇవ్వాలని అన్నారు. భూములు సాగు చేసుకోవడం కోసం పంట రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వం అనేకమైన నిబంధనలు విధించి ఉపాధి హామీ చట్టానికి  తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో కూలీలను ఉపాధి హామీ పథకానికి దూరం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. కానీ ఉపాధి హామీ పథకంలో ఆధార్ కార్డు కు జాబు కార్డు లింక్ చేసి కూలీ డబ్బులు ఇస్తామని సాకు చెప్పి లక్షలాదిమంది కూలీలను తొలగించిందని ఆరోపించారు. 

సంవత్సరానికి 200 రోజులు ఉపాది పని కల్పించి, రోజూ రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలకనుగునంగా కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిoడిన ప్రతి వ్యవసాయ కార్మికుడికి నెలకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని అన్నారు. కార్మికుల పేర్లను గ్రామపంచాయతీలో నమోదు చేయాలని సూచించారు. ఇల్లు లేని వారందరికీ ఇండ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. మహిళలకు ప్రతి నెల రూ.2500/- ఇవ్వాలన్నారు. ప్రమాదంలో మరణించినా.. గాయపడినా ఎక్స్గ్రేషియా  పెంచాలని, ఆరోగ్య ఇన్సూరెన్స్ అమలు చేయాలని అన్నారు.

 స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక లేబర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని, ఈ చట్టాన్ని అమలు పర్యవేక్షించడానికి అన్ని స్థాయిల్లో అధికారులు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులతో చట్టబద్ధ కమిటీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు కల్పించాలని అలాగే వ్యవసాయ కార్మిక మహిళలకు ప్రసూతి అలయన్స్ ఆరు నెలలు చెల్లించాలని అన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ మల్లేష్, రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -