Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు లక్ష్మీ లింగం గారి నూతన గృహప్రవేశాన్ని సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గృహ యజమానికి నూతన వస్త్రాలు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహాన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -