Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విషం చిమ్ముతున్న పరిశ్రమలను నిలిపివేయాలి

విషం చిమ్ముతున్న పరిశ్రమలను నిలిపివేయాలి

- Advertisement -

-ప్రభుత్వానికి సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-బెజ్జంకి

ప్రజల ప్రాణాలపై విషం చిమ్ముతున్న ఇథనాల్ పరిశ్రమలను నిలిపివేయాలని మండల సీపీఐ(ఎం)పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం మండల పరిధిలోని పోతారం, గుగ్గీళ్ల గ్రామ శివారుల్లోని ఇథనాల్ పరిశ్రమలను సీపీఐ(ఎం)మండల నాయకులు అయా గ్రామాల ప్రజలతో కలిసి సందర్శించి పరిశీలించారు. మండలంలోని ఇథనాల్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించడంతో వ్యర్థాల వల్ల దుర్వాసన వేదజల్లుతున్నాయని.. దుర్వాసన పరిశ్రమల పరిసర గ్రామాల ప్రజలకు విషం మారిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వాలు..పరిశ్రమలతో విషం చిమ్మిస్తూ భవిష్యత్తులో మరణమృదంగాలకు తెరలేపుతున్నాయని, ముత్తన్నపేట గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమలను ప్రభుత్వం మూసివేయాలని, లేనిపక్షంలో కార్యచరణ ప్రకటించి రాజీవ్ రహదారిని దిగ్భంధన చేస్తామని సీపీఐ(ఎం)నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కమిటీ సభ్యులు సంగ ఎల్లయ్య,బొమ్మిడి సాయికృష్ణ,అయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -