Monday, January 12, 2026
E-PAPER
Homeమానవిపసిపిల్లలను ఇలా…

పసిపిల్లలను ఇలా…

- Advertisement -

చలి కాలంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే వారిని జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు వేధిస్తాయి. చాలా ఇబ్బంది పడతారు. అందుకే చంటి బిడ్డలను వెచ్చగా ఉంచాలి. చిన్నారికి.. జాకెట్లు, స్వెటర్లు వేయకూడదు. మృదువుగా ఉండే.. కాటన్‌ దుప్పటిని కప్పాలి. సున్నితంగా ఉండే.. కాటన్‌ బట్టలు వేయండి. పసిపిల్లల చెవిలో.. దూదిపెట్టకూడదు. బదులుగా, చిన్నారికి ఇరువైపులా కాటన్‌ ప్యాడ్‌లు, ప్యాడ్‌లను దిండుగా పెట్టాలి. . ఇవి చలిగాలి నుంచి బిడ్డను రక్షిస్తాయి.

పిల్లలను బయటకు తీసుకువెళ్లేప్పుడు..
చలికాలంలో వీలైనంత వరకు పిల్లలను బయటికి తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ.. తీసుకువెళ్లాల్సి వస్తే మంచు కరిగాక, చలి తగ్గిన తర్వాత.. అంటే మధ్యాహ్నం ప్లాన్‌ చేసుకుంటే మంచిది. వీలైనంత వరకు, పిల్లలను సురక్షితంగా కార్‌లో తీసుకెళ్లండి. బైక్‌, బస్సులో వెళ్తుంటే.. పిల్లలను మందపాటి దుప్పటిలో చుట్టి, చెవులను టోపీతో కవర్‌ చేసి, చేతులు కాళ్లకు గ్లౌజులు తొడగాలి.

చర్మం పొడిబారకుండా..
చల్లటి గాలులు, తేమ లేకపోవడం వల్ల.. చర్మం పొడిబారుతుంది. వాళ్ల స్కిన్‌ను హైడ్రేట్‌గా ఉంచండి. చిన్నారికి ఎక్కువ సేపు స్నానం చేయించకండి, గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. స్నానం చేయించిన తర్వాత. శుభ్రమైన టవల్‌తో వాళ్లను తుడిచి.. ఆరిన తర్వాత మాయిశ్చరైజర్‌ రాయండి. మాయిశ్చరైజర్‌ మీ బిడ్డ చర్మం డ్రైగా అవ్వకుండా కాపాడుతుంది. పిల్లల చర్మం ఎర్రగా, చికాకుగా మారితే.. డాక్టర్‌ను సంప్రదించండి.

మసాజ్‌ చేయండి..
శీతకాలం పిల్లలకు మసాజ్‌ చాలా మంచి చేస్తుంది. చలికాలంలో వారికి రోజూ ఆయిల్‌ మసాజ్‌ చేయొచ్చు. శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, ఇన్ఫెక్షన్లను తరిమి కొట్టేందుకు మసాజ్‌ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్‌ మసాజ్‌తో వారి చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -