మోడీ సర్కారువి డొల్లమాటలు : లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో సంఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో రూపాయి విలువ పడిపోవడం, పారిశ్రామిక ఇంధన ధరలు పెరగడంపై లోక్‌సభలో విపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భారత్‌లో ద్రవ్యోల్బణం ఖాయమని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన ఆర్థిక వ్యూహానికి బదులుగా డొల్ల మాటలు మాట్లాడుతోందని విమర్శించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం 93 మార్కు కంటే దిగువకు పడిపోయిందని రాహుల్ గాంధీ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ”డాలర్‌తో పోలిస్తే రూపాయి బాగా బలహీనపడడం, పారిశ్రామిక ఇంధన ధరలు విపరీతంగా పెరగడమనేవి రాబోయే ద్రవ్యోల్బణానికి స్పష్టమైన సంకేతాలు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటారు. మోడీ ప్రభుత్వం దీనిని సాధారణమని అనుకోవచ్చు. కానీ వాస్తవంలో ఉత్పత్తి, రవాణా మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఎంఎస్‌ఎంఈలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ఎఫ్‌ఐఐల డబ్బు మరింత వేగంగా బయటకు తరలిపోతుంది. ఇది స్టాక్ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి జేబుపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు కూడా పెరుగుతాయి.” అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
భవిష్యత్తులో ద్రవ్యోల్బణం ఖాయం
- Advertisement -
- Advertisement -



