Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమాచార చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్

సమాచార చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ 
సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. స.హ చట్టం ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమాన్ని నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు ఎల్.సీ.డీ తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సమాచార హక్కు చట్టం అమలుపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేయించిన ప్రతిజ్ఞలో అన్ని శాఖల పీఐఓ, ఏపీఐఓలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ, పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని, స్వచ్ఛందంగా ఇవ్వవలసిన సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉండేలా వ్యవహరిస్తానని, పనితీరులో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పాటిస్తూ పని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సమాచార చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ, నిజామాబాద్ జిల్లాకు కూడా అవార్డులు సాధించి ప్రత్యేక గుర్తింపు తేవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -