Friday, October 17, 2025
E-PAPER
Homeబీజినెస్ఇన్ఫోసిస్‌ ఒక్కో షేర్‌పై రూ.23 డివిడెండ్‌

ఇన్ఫోసిస్‌ ఒక్కో షేర్‌పై రూ.23 డివిడెండ్‌

- Advertisement -

క్యూ2 లాభాల్లో 13.2 శాతం వృద్ధి
బెంగళూరు : దేశంలోనే రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌ తమ వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటిం చింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.23 చెల్లించేందుకు ఆ కంపెనీ బోర్డు ఆమో దం తెలిపింది. దీనికి అక్టోబర్‌ 27వ తేదిని రికార్డ్‌ తేదిగా నిర్ణ యించగా.. నవంబర్‌ 7న చెల్లింపులు చేయనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో ఇన్ఫోసిస్‌ 13 శాతం వృద్ధితో రూ.7,364 కోట్లుగా నమోదయ్యింది. రెవెన్యూ 9 శాతం పెరిగి 44,,490 కోట్లకు చేరింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో మెరుగైన వృద్ధిని సాధించామని ఆ కంపెనీ సీఈఓ, ఎండి సలీల్‌ పరేక్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -