Sunday, February 15, 2026
E-PAPER
Homeబీజినెస్ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు 85 శాతం బోనస్‌

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు 85 శాతం బోనస్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ టెక్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌ తమ ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి గాను ఇన్ఫోసిస్‌ సగటున 85 శాతం పనితీరు బోనస్‌ చెల్లించనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కారణంగా ఐటీ సర్వీసెస్‌ పనుల్లో ఆటోమేషన్‌ పెరిగి ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనల మధ్య, టెక్నాలజీ స్టాక్స్‌ ఒత్తిడిలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఉద్యోగుల నైతిక ధైర్యాన్ని పెంచుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ బోనస్‌ చెల్లింపు ఫిబ్రవరి నెల జీతంతో కలిపి అందించనున్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత బోనస్‌ చెల్లింపుల తేడాల్లో 75 శాతం నుంచి 100 శాతం మధ్య ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. కొంతమంది గత త్రైమాసికం కంటే 15 శాతం ఎక్కువ అందుకున్నామని చెప్పగా, మరికొందరు పూర్తి 100 శాతం అందుకున్నట్టు వెల్లడించారు. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలోనూ 75 శాతం బోనస్‌ను చెల్లించింది. కాగా.. వార్షిక జీతాల పెంపునపై ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. గతేడాది 5-8 శాతం మధ్య వేతనాలను పెంచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -