ఎంపీడీఓ శ్రీనివాసరావు
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలపై తనిఖీలు నిర్వహించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు, మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ టి. శ్రీనివాసరావు మరియు ఎంపీఓ లు స్వర్ణ జ్యోతి ల బృందం మణుగూరు మండలంలోని పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. మౌలిక సదుపాయాలైన విద్యుత్, తాగునీరు, బాలుర, బాలికల టాయిలెట్లపై భౌతిక తనిఖీ నిర్వహించమన్నారు యు డి ఐ ఎస్ ఇ పోర్టల్‌లో సరిగా నమోదు చేయని వివరాలను సరిచూడడం విషయాలను తనిఖీలు చేశామన్నారు ఈ తనిఖీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ తనిఖీల సందర్భంగా మొత్తం 12 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మరుగుదొడ్లు టాయిలెట్లు 8 పాఠశాలల్లో బాలుర మరుగుదొడ్లు లేవన్నారు. ఒక పాఠశాలలో బాలుర మరుగుదొడ్డి, మరొక పాఠశాలలో బాలికల మరుగుదొడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ, అవి పనిచేయడం లేదన్నారు విద్యుత్ సౌకర్యం 2 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేదన్నారుతాగునీరు సమస్య లేదన్నారు మణుగూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉందన్నారుఈ తనిఖీ నివేదిక సిద్ధం చేశామన్నారు పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES