- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని పెద్దూరు గ్రామ శివారులో ఆర్ అండ్ బీ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు జీబ్రా క్రాస్ లైన్స్ వేస్తున్నారు. సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారిలో రద్దీగా ఉండే ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వాహనాలు వేగంగా వెళ్లేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఏడు జీబ్రా క్రాస్ లైన్స్ వేస్తూ ప్రమాదాలకు చెక్ పెట్టే కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దూరు గ్రామ శివారులో ఈ పనులను ప్రారంభించారు.
- Advertisement -