– నీటివాటాల సాధనలో పాలకులు విఫలం
– కేసీఆర్, రేవంత్‌రెడ్డి, ఇద్దరూ బాధ్యులే : రౌండ్‌టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నీటి వాటాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోం దని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ”తెలం గాణలో కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటా పొందడంలో విఫలం-కారణాలు” అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. నీళ్లు నిధులు, నియా మకాల లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ పన్నెండేండ్ల స్వరాష్ట్ర పాలనలో అన్నింటా అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, లంచాలకు మరిగి తెలంగాణ సొమ్మును కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేస్తు న్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని జస్టిస్ పినాకిని ఘోష్ కమిటీ నివేదిక ఇచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కేసును సీబీఐకి అప్పగించారని ఆరోపించారు. మెఘా కృష్ణారెడ్డికి మేలు చేసేందుకే కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు తమ స్వప్రయోజనాల కోసమే పాటు పడ్డారని విమర్శించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంలో ఇద్దరు దోషులేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ దొంతుల లక్ష్మీనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు నీటి వాటాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ”కృష్ణానది తెలంగాణ లో 70 శాతం, ఏపీలో 30 శాతం ప్రవహిస్తోంది. 70 ఏండ్లుగా తెలం గాణ ప్రాంతానికి కృష్ణా జలాల పంపిణీలో అన్యాయం జరుగుతోంది. నది పరివాహకాన్ని పరిగణంలోకి తీసుకోకుండా బచావత్ ట్రిబ్యూనల్ 512 ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడుస్తున్నా తెలంగాణకు జరుగుతున్న అన్యా యాన్ని సరిదిద్దడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. కృష్ణా బేసిన్‌పై ఆధారపడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా లకు చెందిన పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్, నెట్టెంపాడు, భీమా డిండీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత సర్కార్ చెబుతున్నట్టు పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి 90 శాతం పనులు కాలేదనీ, రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి, 36 శాతం పనులు మాత్రమే చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే రూ.35వేల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్ట్‌ను రూ.65 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక నాయకులు రాఘవాచారి, నైనాల గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనూ తెలంగాణకు అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



