సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి… ఏడుగురికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొీట్టడంతో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వ సౌమ్యరెడ్డి(25) హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ కంపెనీలో పనిచేసేది. ఆదివారం తన స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీత్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతితో కలిసి ఇన్నోవా కారులో యాదాద్రి భువన గిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండల పరిధిలోని, సరళ మైసమ్మ గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం తన స్నేహితుల్లో ఒకరిని ఇబ్రహీంపట్నంలో దింపి.. బొంగ్లూర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కారు. ఘట్కేసర్ వైపు వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బలిజగూడ పరిధి దాటాక ఎగ్జిట్ నెం.10 సమీపంలో వారి కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొీట్టి పక్క కు దూసుకెళ్లింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యా యి. వారిని వెంటనే పోలీసులు హయత్‌నగర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌ను ఉప్పల్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. సౌమ్యరెడ్డి పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఓఆర్‌ఆర్‌పై డివైడర్‌ను ఢీకొీట్టిన ఇన్నోవా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES