– ఎమ్మెల్యే వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు.
– ప్రజలను ఇబ్బందులను ఇబ్బందులకు గురిచేయడం కాదు.. మండలాన్ని అభివృద్ధి చేయాలి
– దీక్షకు మద్దతు తెలిపిన రాష్ట కార్మిక సంఘం అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
– ఓబీసీ జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచ్ వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్
నవతెలంగాణ – ఊరుకొండ
ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఊరుకొండ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై వినూత్న రీతిలో దీక్ష చేపట్టారు. మంగళవారం ఊరుకొండ మండల కేంద్రంలోని కల్వకుర్తి – జడ్చర్ల ప్రధాన రహదారి పక్కన ఊరుకొండ మండల అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష నాలుగవ రోజు మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు.
4వ రోజు దీక్షకు మద్దతుగా రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చెరుకు మణికంఠ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ సభ్యులు, కుల సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూర్తి మద్దతు ఇవ్వడంతో పాటు మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ లోనే కొనసాగించాలని లేని పక్షంలో మండల ప్రజల సహకారంతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామనన్నారు.
ప్రజల అభీష్టం మేరకు ఊర్కొండ మండలం విషయంలో చేపడుతున్న దీక్షను అనుకున్నది సాధించే వరకు విరమించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక సంఘం అధ్యక్షుడు చెరుకు మణికంఠ, జేఏసీ నాయకులు, నర్సంపల్లి మాజీ సర్పంచ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.. ఊర్కొండ మండలాన్ని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలనీ.. భవిష్యత్తులో కల్వకుర్తి జిల్లాగా ఏర్పడితే ఊర్కొండను కల్వకుర్తి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. భౌగోళికంగా కల్వకుర్తికి అత్యంత సమీపంలో ఉన్న మండల ప్రజలకు అన్ని రకాలుగా కల్వకుర్తితోనే అనుబంధం ఉందన్నారు.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మండలాన్ని అటు ఇటు మార్చాలని చూడటం ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు ప్రజల సౌకర్యం కోసం చూడాలి తప్ప, ఇబ్బందులు సృష్టించకూడదు అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తి ప్రాంత వాసి కాబట్టి, ఇదే సరైన సమయమని కల్వకుర్తిని జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారం చేయాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఊర్కొండ మండల కేంద్రంలో చేస్తున్న ఈ పోరాటం ఆగదని, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ, కల్వకుర్తి తాలూకా జేఏసీ చైర్మన్ కానుగుల జంగయ్య, ఏంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు, తాడెం చిన్న, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు బోలె జగన్, బోల్గాం నరేందర్ గౌడ్, బీసీ తెలంగాణ ఉద్యమకారుడు బొజ్జయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, ఆలకుంట వెంకటేష్, పరశురాములు, దుబ్బ రాములు మాదిగ, బచ్చల కూర మల్లేష్, బుడుమ జంగయ్య, పయ్యావుల జంగయ్య, బండారి శివుడు, డాన్ శివ, కటికం ఆనంద్ గౌడ్, రాజునారంరెడ్డి, కటికం చిన్నబాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.



