కథానాయిక అనుష్కతో హీరో రానా ‘ఘాటి’ సినిమా గురించి చేసిన ఫోన్ కాల్ విశేషాలు అందరిలో మంచి క్యూరియాసిటీని రైజ్ చేశాయి. దీన్ని మరింతగా ఎలివేట్ చేస్తూ లేటెస్ట్‌గా అగ్ర కథానాయకులు ప్రభాస్, అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబోలో రూపొందిన యాక్షన్ డ్రామా’ ఘాటి’. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్నారు. విడుదలకు ఒక రోజు ముందు ప్రభాస్ ఈ చిత్ర రిలీజ్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు. ఇదిలా ఉంటే, మరో అగ్రకథానాయకుడు అల్లుఅర్జున్ సైతం నాయిక అనుష్కకు కాల్ చేసి సినిమా గురించి ఇంటర్వ్యూ చేశారు.
అలు అర్జున్ : మిమ్మల్ని స్వీటీ అని పిలవాలా? లేక ‘ఘాటి’ అనాలా?
అనుష్క : ఎప్పుడూ స్వీటీనే. నేనెప్పుడు మంచి పాత్రలు చేసినా మీరు ఫోన్ చేసి ప్రశంసిస్తుంటారు. మీ సపోర్ట్‌కి ధన్యవాదాలు.
అల్లుఅర్జున్ :అందుకు నువ్వు అర్హురాలివే కదా?
అనుష్క : మీకు ఎప్పటి నుంచో ఈ మాట చెప్పాలనుకున్నా. ‘పుష్పరాజ్’ పాత్ర ద్వారా మీరు చాలా మందిలో మార్పు తీసుకొచ్చారు. సినిమాలో చూపించినట్టుగా భార్యను భర్త ఓ స్థాయిలో చూస్తున్నాడు. చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు.
అల్లు అర్జున్ : మీ సినిమా విడుదల కాబోతోంది. టెన్షన్ ఉందా?
అనుష్క : చాలా టెన్షన్‌గా ఉంది. సరోజ (వేదం సినిమా) పాత్రను ఎంపిక చేసుకున్నప్పుడు కొత్తగా అనిపించింది. ఇప్పుడు శీలావతి రోల్ కూడా అంతే. ఇంతకముందు పోషించిన పాత్రలన్నింటికీ భిన్నమైనది. యాక్షన్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
అల్లు అర్జున్ :’పుష్ప’ ప్రపంచంలోకి ‘ఘాటి’ వస్తుందని చెప్పారా?
అనుష్క : ఆ మాట నేను అనలేదు (నవ్వుతూ). ఓ ఇంటర్వ్యూలో దాని గురించి ప్రశ్నిస్తే, అదిరిపోతుందని, దర్శకుడు సుకుమార్‌కి ఈ విషయం చెప్పండి అని సమాధానమిచ్చా.
అల్లుఅర్జున్ : ఒకవేళ పుష్పరాజ్, శీలావతి ఒకే సినిమాలో నటించాల్సి వస్తే డైరెక్టర్ ఎవరైతే బాగుంటుంది? సుకుమార్ లేదా క్రిష్?
అనుష్క :దీనికి సమాధానం ఇప్పుడు చెప్పడం కష్టం (నవ్వుతూ).
‘ఘాటి’ కోసం వినూత్నంగా..
- Advertisement -
- Advertisement -