Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ ఆవరణంలో బిసి సంఘాల జేఏసీ నాయకులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులతో పాటు చిరు వ్యాపారులకు గులాబి పూలు అందించి బిసి సంఘాల ఉద్యమానికి సహకరించాలని వారు కోరారు. జై బీసీ అని బీసీ నాయకులు నినాదాలు చేస్తూ బస్టాండ్ లోని ప్రయాణికులతో పాటు చిరు వ్యాపారులను కూడా జై బీసీ అని అనిపించారు. ఈ కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి అధ్యక్షులు రాజేందర్ జేఏసీ నాయకులు సదానందం గౌడ్ శ్రీనివాసులు గోపాల్ సురేష్ దారమోని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -