నీటిపారుదలశాఖపై సీఎం సమీక్ష
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నదీ జలాలు, ప్రాజెక్ట్ట్‌లకు సంబంధించిన అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించారు. నదీ జలాల్లో వాటా, ఏపీతో వివాదాలు, బీఆర్‌ఎస్ హయాంలో అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు, తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశాల్లో ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో అందుకు సంబంధించిన అన్ని వివాదాలపై దృష్టి సారించారు.గత సర్కార్ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, పురోగతి, రెండేండ్లుగా చేపట్టిన పనులపై సమావేశంలో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టులపై గురువారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవ్వనున్న ప్రజెంటేషన్‌కు సంబంధించి చర్చ జరిగినట్టు తెలిసింది. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవాలని సీఎం మంత్రికి సూచించినట్టు సమాచారం.
వివాదాలపై ఆరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



