Thursday, February 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామంలోని విద్యుత్ సమస్యలపై ఆరా 

గ్రామంలోని విద్యుత్ సమస్యలపై ఆరా 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని దామెర భీమనపల్లి గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యుత్ అధికారులతో కలిసి గ్రామంలోని గల్లి గల్లి తిరుగుతూ గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య మాట్లాడుతూ.. త్వరలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామంలోని విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులతో పాటు,ఉపసర్పంచ్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -