యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు డిమాండ్
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా
బాధితులకు సీఐటీయూ భరోసా
11 కుటుంబాలకు రూ.5 వేల చొప్పున సాయం
నవతెలంగాణ-సంగారెడ్డి
పాశమైలారం ప్రాంతంలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు, రూ.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ.. తక్షణం మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించని అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యాన్ని ఇప్పటివరకు అరెస్టు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కలిగిన వారికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్, సాయిలు, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వర్‌రావు, విద్యాసాగర్, కృష్ణ, నాయకులు పాండురంగారెడ్డి, నర్సింహారెడ్డి, బాగారెడ్డి, నాగభూషణం, బాలరాజు, శివకుమార్, విఠల్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం
సిగాచి ప్రమాదం జరిగిన నాటి నుంచి తమ పార్టీ బాధితుల పక్షాన నిలబడుతోందని చుక్క రాములు అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సదుద్దేశంతోనే కార్మికుల కుటుంబాలకు సీఐటీయూ యూనియన్.. శాండ్విక్ పరిశ్రమ నుంచి రూ.20 వేలు, తోషిబా పరిశ్రమ యూనియన్ నుంచి రూ.15 వేలు, సిబిఎల్ పరిశ్రమ యూనియన్ నుంచి రూ.10 వేలు, కిర్బీ పరిశ్రమ యూనియన్ నుంచి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.55000 ఆర్థిక సహాయాన్ని అందజేసిందని తెలిపారు. యాజమాన్యం లాభాపేక్ష కోసం అన్‌స్కిల్డ్ కార్మికులతో పని చేయించడంతోపాటు కాలం తీరిన రియాక్టర్లు, ఇతర పరికరాలను వాడటం వల్లే పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. పరిశ్రమల నిర్వహణలో జరుగుతున్న లోపాలపై తనిఖీలు చేయకుండా ప్రభుత్వాలు నిర్ణయాలు చేయడం వల్ల పెట్టుబడిదారుల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. సంబంధిత అధికారులు ఫ్యాక్టరీలను తనిఖీ చేయకపోవడంతో యజమానులకు అనుకూలంగా మారిందన్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమల్లో డయ్యర్లు, రియాక్టర్లు పేలిన ప్రమాదాల్లో కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమ యాజమాన్యం కార్మికులను ఆదుకోవడంలో చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పటికీ ఆచూకీ లభించని వారి కుటుంబాలు పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నా, వారిని పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాశమైలారం ఇండిస్టియల్ క్లస్టర్ కన్వీనర్ అతిమేల మాణిక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి, బాగారెడ్డి, తోషిబా యూనియన్ ప్రధాన కార్యదర్శి అనంతరావు, యూనియన్ల నాయకులు మనోహర్, ప్రసన్న, సురేష్, విట్టల్, సంతోష్, మదన్ రెడ్డి, రాజు పాల్గొన్నారు.
సిగాచి బాధితులకు సీఐటీయూ భరోసా
సిగాచి పరిశ్రమ ప్రమాద బాధిత కుటుంబాలకు సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అనుబంధ యూనియన్లు ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామంటూ భరోసా కల్పించాయి. ప్రమాదం తర్వాత ఆచూకీ తెలియని 11 మంది కార్మికుల కుటుంబీకులు కనీసం చేతి ఖర్చులకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుండడంతో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు సారథ్యంలో వివిధ పరిశ్రమల యూనియన్ల సహకారంతో ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున సహాయం అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం ఐలా భవన్ వద్ద బాధిత కార్మికుల కుటుంబ సభ్యులను వారు శనివారం పరామర్శించారు.
సిగాచిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES