నవతెలంగాణ- బెజ్జంకి: హుస్నాబాద్ లో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను తిరిగి మండలానికి మార్చడానికి గురుకుల ఎస్సీ సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ,వైస్ ప్రిన్సిపాల్ జ్యోతి,ఉపాధ్యాయురాలు స్వప్న గురువారం పర్యటించి మండల కేంద్రంలోని బాలికల, బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల భవనాలను పరిశీలించినట్టు మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చోరవచూపి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలను తిరిగి మండలానికి మార్చడానికి కృషి చేశారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ వెల్లడించారు.ఏఎంసీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, ఆలయ ఛైర్మన్ జెల్లా ప్రభాకర్,డైరెక్టర్లు మల్లేశం,పులి సంతోష్,గ్రామ శాఖాధ్యక్షుడు బండిపల్లి రాజు, ఐలయ్య,రవి,రొడ్డ మల్లేశం,రావుల నర్సయ్య,రమేశ్ పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలకు భవనాల పరిశీలన ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES