Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్దాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

దాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..

- Advertisement -

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  దోటి నారాయణ…
నవతెలంగాణ – చండూరు
: మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లెంల గ్రామాలల్లో ఏర్పాటు చేసిన  దాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ  మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ  సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు  కొనుగోలు కేంద్రాలలో దాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు. ప్రభుత్వం సన్న రకాలకు రూ.500 బోనస్ చెల్లిస్తూ రైతులకు అండగా నిలుస్తుందాన్నారు. నిర్వాహకులు త్వరితగతిన దాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలనీ కోరారు. కొనుగోళ్లు చేసిన దాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. అంతకు ముందు ఆయన రైతులతో మాట్లాడి, ప్రధాన సమస్య అయిన ధాన్యం తరలించుటకు అవసరమైన లారీలను గుర్తించి తక్షణమే ఆయన స్పందించి, వెంటనే  అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో ధాన్యాన్ని తరలించాలని అధికారులకు సూచించారు. అవసరమైన లారీలను కొనుగోలు చేసిన ధాన్యం ను మిల్లులకు తరలించటానికి  60 లారీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోలు వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోరిమి ఓంకారం, డైరెక్టర్ లు భూతరాజు ఆంజనేయులు, తలారి నరసింహ, నలపరాజు రామలింగయ్య, ఆయా  గ్రామాల రైతులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -