ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలి..
నవతెలంగాణ – డిచ్ పల్లి
గత రెండు మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గాను ఇందల్ వాయి మండలంలోని సిర్నాపల్లి, నల్లవెల్లి, రాంసాగర్ తండా , గ్రామాల్లో నష్టపోయిన పంటలను సిపిఐ, సిపిఎంఎల్, రైతు సంఘాల నాయకులు శనివారం రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైన ఉన్న చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతంలోని పంటలు తీవ్రంగా నష్టపోయని, దీంతో పంట పొలాల్లో ఇసుక మెట్టలు వేసి తీవ్రమైన నష్టం వాటిల్లిందని వాపోయారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పరిశీలించి, రైతులను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రైతులు నోటికొచ్చిన పంటనష్టపోయినందున ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలని, ఇసుక మెట్టలు వేసిన పంట పొలాలు కోసుకుపోయినందున వాటిని బాగు చేయడానికి ఇసక మెట్టలు తొలగించడానికి, వాటిని సారవంతం చేయడానికి ప్రభుత్వం వెంటనే వారికి ఎకరానికి రూ.50వేల నష్టపరిహారంతో పాటు పంట నష్టం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకులు సాయ గౌడ్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, వై రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అడ్డికే రాజేశ్వర్, ఉషన్ రైతులు రైతులు పాల్గొన్నారు.
నష్టపోయిన పంట పొలాల పరిశీలన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES