Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిథిలావస్థ కరెంటు స్తంభాల పరిశీలన

శిథిలావస్థ కరెంటు స్తంభాల పరిశీలన

- Advertisement -

సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖకు వినతి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో  శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ ఏఈ వెంకటేష్‌తో పాటు లైన్‌మెన్లు ఉపేందర్,వెంకటేష్,మల్లేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ గ్రామంలో పాతబడి ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త స్తంభాలు నాటాలని ఏఈను కోరారు.

అదేవిధంగా గ్రామంలో లూజు లైన్ల కింద కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలోని రైతుల వ్యవసాయ బావుల వద్ద లూజు లైన్ల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ కొత్త విద్యుత్ స్తంభాలు నాటాలని,ఇటీవల కొత్తగా బోర్లు వేసిన రైతులకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి స్తంభాలు ఏర్పాటు చేయాలని వినతిపెట్టారు. ఒకే ట్రాన్స్ఫార్మర్‌పై ఎక్కువ మోటార్లు ఉండి ఓల్టేజ్ సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరారు. కొన్ని చోట్ల మెయిన్ లైన్ కిందే రైతుల మోటార్ లైన్ ఉండటంతో కరెంటు షాక్ ప్రమాదం ఉందని, అలాంటి ప్రాంతాల్లో మెయిన్ లైన్‌కు పక్కనే మరో లైన్ వేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. కొత్తగా బోర్లు వేసిన రైతులు డీడీలు చెల్లించిన వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం ఇస్తారి, వార్డు సభ్యులు వడ్ల సోమయ్య, చౌడబోయిన లావణ్య, రవి, పోశమణి, కనకయ్య, పోతారం కనకయ్య, చౌడబోయిన ఆంజనేయులు, అనిత, మహేష్, కొత్తపల్లి రేణుక, మైసయ్య, చౌడబోయిన మైసయ్య, శ్రీను, రాజేష్, దండు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -