నవతెలంగాణ – బజార్హత్నూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం జిల్లా ఇంటర్ విద్యాధికారి జాదవ్ గణేష్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా టీచింగ్ డైరీ, అడ్మిషన్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి తరగతి గదులను, సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని మంచి ఫలితాలను సాధించాలని పేర్కొన్నారు. అధ్యాపకులు ఈ విద్య సంవత్సరం కళాశాల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని, వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కళాశాల అభివృధికి పాటుపడాలని తెలియజేశారు. అంతేకాకుండా సైన్స్ విద్యార్థులకు ప్రాక్టీకల్స్ సకాలంలో చేయించాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ కే సునీల్, డి ఐ ఈ ఓ ఆఫీస్ సూపర్డెంట్ మోహసీన్, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



