- Advertisement -
- ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ బి.ఎస్.లత
- నవతెలంగాణ – రాయికల్
పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా అదనపు(రెవెన్యూ) కలెక్టర్ బి.ఎస్.లత పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పని తీరు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్.ఐ పద్మయ్య ఉన్నారు.
- Advertisement -



