- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పైప్ లైన్ మరమత్తు పనులను సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ.. గ్రామంలో పైపులైన్ లీకేజీలు లేకుండా గ్రామ పంచాయితీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలనిన్నారు.
గ్రామంలో ప్రజలకు తాగునీటిని అందించే నల్ల నీటి పైపులైన్ లలో ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా సిబ్బంది జాగ్రత్త పడాలన్నారు. పైపులైను లీకేజీలు ఉంటే నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడతారన్నారు. గ్రామంలో ఎక్కడైనా పైపు లైన్ లీకేజీలు ఉంటే తక్షణమే మరమత్తులు చేయాలని సిబ్బందికి సూచించారు.
- Advertisement -



