Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కమ్మర్ పల్లిలో పౌల్ట్రీ యూనిట్ల పరిశీలన

కమ్మర్ పల్లిలో పౌల్ట్రీ యూనిట్ల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో మహిళా సంగం  సభ్యురాలి ద్వారా నిర్వహిస్తున్న పౌల్ట్రీ యూనిట్ ను ఏపీడి  మధుసూదన్, ఫారం డీపీఎం రాచయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. గ్రామాలలో మహిళ సంఘాలలో ఉన్న  ఆసక్తిగల సభ్యులను బ్యాక్ యాడ్ పౌల్ట్రీ నిర్వహించే విధంగా ప్రోత్సహించాలని  సిబ్బందికి సూచించారు.బ్యాక్ యాడ్ పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు కోసం మండలానికి 250 యూనిట్ల గాను ఒక్కొక్క యూనిట్ కి రూ.2వేల చొప్పున రూ.5 లక్షల వరకు రుణము ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. పౌల్ట్రీ నిర్వహణలో ఆసక్తి ఉన్న మహిళా సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్, సీసీలు రవికుమార్, అలేఖ్య, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -