నవతెలంగాణ – ఆర్మూర్
ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో టియుఎఫ్ఐ డిసి నిధులతో మల్ల రెడ్డి చెరువు (మల్లెడి చెరువు) నుండి అరుంధతి నగర్ స్మశాన వాటిక పిప్రి రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులను శుక్రవారం పరిశీలించినారు. పట్టణ బిజెపి నాయకులు రోడ్డు విస్తరణ పనులు పరిశీలించి ఎమ్మెల్యేకు కాలనీవాసులు, పట్టణం ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు పనులు కోసం ఎదురుచూసిన పట్టణవాసులు కల సహకారం అవుతున్న వేళ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మందుల బాలు సీనియర్ నాయకులు జెస్సు అనిల్, సుంకరి రంగన్న, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్ ఉపాధ్యక్షులు బాండ్లపల్లి నర్సిరెడ్డి, కార్యదర్శి కుమార్, బాసెట్టి రాజ్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఉదయ్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ జగన్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


