నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో ఉన్న ఎరువుల గోదాంను గురువారం మండల వ్యవసాయ అధికారి శ్రీజ,కొయ్యుర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా సరఫరాపై ఆరా తీశారు. స్టాక్ను ప రిశీలించి, ఇప్పటి వరకు ఏ మేరకు రైతులకు యూరియా అందించారో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. యూరియా అక్రమ రవాణా జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూరియాను అక్రమంగా తరిలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు.అసలైన రైతులకే ఎరువులను ఇవ్వాలన్నారు. ప్రతి రైతు దగ్గర నుంచి కచ్చితంగా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్కు పరిశీలించి రైతులకు ఎరువులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ పృధ్విరాజ్,పిఎసిఎస్ సొసైటీ అధికారులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ ఎరువుల గోదాంలో తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES