Saturday, January 10, 2026
E-PAPER
HomeNewsపట్టణంలో పలు దుకాణాలలో తనిఖీలు

పట్టణంలో పలు దుకాణాలలో తనిఖీలు

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్  
జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు వారు నాలుగు బృందాలుగా ఏర్పడి పట్టణంలోని గాలిపటాలు అమ్మే 12 షాపులను శుక్రవారం రాత్రి తనిఖీ చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరైనా చైనా మాంజా అమ్మితే చట్ట ప్రకారం తగు చర్యలు తప్పవని అన్నారు. ఎవరైనా చైనా మాంజా వలన ప్రమాదానికి గురై చనిపోతే హత్యా నేరము కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇంటికి తాళాలు వేసి పోయేటప్పుడు తమ, తమ విలువైన వస్తువులను వెంట తీసుకొని వెళ్లాలని తెలిపారు. ఎక్కువ మొత్తంలో నగదు ఉంటే బ్యాంకుల్లో పెట్టుకోవాలని, తాళం వేసి వెళ్లిపోయేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -