- Advertisement -
నమూనాలు సేకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్,డీజిల్ గోల్మాల్ చేస్తున్నారని వినియోగదారుల ఫిర్యాదుపై మంగళవారం డీసీఎస్ఓ కిరణ్ మార్, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీలత ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనల ప్రకారం గాలి పంపు,మంచినీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ నాణ్యత, వ్యత్యాసాన్ని పరిశీలించేందుకు నమూనాలను సేకరించారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవన్నారు.అనంతరం మల్లారం రైస్ మిల్లును పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో సివిల్ సప్లయీస్ ఆస్ఐ సురేందర్రెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -