- Advertisement -
నవతెలంగాణ – పెద్దపల్లి
పెద్దపల్లి పట్టణంతో పాటు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండల కేంద్రాలలో ఔషధ దుకాణాలపై ఔషధ నియంత్రణ ఆధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఔషధ నియంత్రణ జిల్లా అధికారి పిట్ట శ్రావణ్ మాట్లాడుతూ.. యాంటిబయోటిక్స్ను అర్హత గల వైద్యుడి ప్రెస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ ఒక్క కొనుగోలుదారుడికి తప్పకుండా బిల్లును ఇవ్వాలని సూచించారు. అధిక ధరలకు మందులు విక్రయించిన, బిల్లు ఇవ్వకపోయిన ఔషధ నియంత్రణ తనిఖీ అధికారికి 8333818142 ఫిర్యాదు చేయాలన్నారు.
- Advertisement -



