నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుర్గ మాత నవరాత్రి మండపాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి పాయింట్ బుక్ లను తనిఖీ చేసి పాయింట్ బుక్కులో నమోదు చేయబడినటువంటి నిబంధనలో ప్రతి ఒక్కరు తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు.నిర్వాహకులు భక్తులు పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతీ దుర్గామాత మండలి వద్ద ఉదయం వేళలో మరియు రాత్రి వేళలో ఇద్దరూ లేదా ముగ్గురికి తక్కువ కాకుండా తమ కమిటీ మెంబర్లను మండలి వద్ద ఉంచవలెను. పోలీస్ వారు చెకింగ్ కు వచ్చినప్పుడు ప్రతీసారి కనబడవలెను. మండపము దగ్గర అసాంఘిక చర్యలు లేకుండా చూసుకోనవలయును. డి.జేలకు ఎలాంటి అనుమతులు లేవు పూర్తిగా నిషేధం అన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండపం పైన పాలిథిన్ కవర్స్ ఉపయోగించాలని , మండపం వద్ద విధ్యుత్ తీగలతో జాగ్రత్తలు పాటించాలి తెలిపారు. మండపాల వద్ద ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని , మండళ్ల వద్ద సందర్శించే మహిళలపై యువతులపై ” ఈవ్ టీజింగ్ జరుగకుండా చూడాలని , ప్రజలకు అసౌకర్యం కలుగకుండా డి.జె / డి.జె మిక్సర్స్ / హై ఫిడిలిటి (హై ఫై ) సౌండ్ సిస్టమ్ ఇక్విప్మెంటు విషయంలో చాలా జాగ్రతలు వహించాలి. కొద్ది మంది ఇండ్లలో గుండె జబ్బులు గలవారు, బి.పి గలవారు, వయసు పై బడిన వృద్ధులు ఉంటారు. మరియు చదువుకునే విద్యార్థులకు ఆటంకము కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్టి సౌండ్ 12 డిజిబుల్ దాటి ఉండరాదు అని, రాత్రి 10-00 గంటలకు “లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలి. లేని యెడల చట్ట రిత్య చర్యలు తీసుకొనబడును అని తెలియజేసారు. ప్రజలకు అసౌకర్యం కలుగజేసే ఎటువంటి చిన్న సమాచారాన్ని అయిన మీ దగ్గరలోని పోలీసులకు తెలుపండి. లేదా డయల్ 100 కు ఫోన్ చేయగలరు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 87126-59700 కు తెలపాలి అన్నారు.
దుర్గామాత నవరాత్రి మండపలు తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES