- Advertisement -
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ శాఖ, మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులను తనిఖీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్స్యూరెన్స్ వివరాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి , డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు.
- Advertisement -



