- Advertisement -
మీ పవిత్ర నామస్మరణే
మనసా వాచా కర్మణా
శిరోధార్యం ప్రభూ !
కర్త కర్మ క్రియ అన్నీ మీరై
ఈ జీవితాలను
గమ్యం చేర్చండి అల్లాహ్!
హదయాల నిండా
భక్తి శ్రద్ధలు లక్ష్యంగా
ప్రతీరోజూ నమాజ్ తో
మీ ఎదుట మోకరిల్లి
మిమ్మల్ని వేడుకుంటాం ప్రభూ !
కష్టనష్టాలను కడతేర్చి
మా బతుకుల్లో
చిరునవ్వులు పూయించండి అల్లాహ్!
అందరికీ ప్రభోద గ్రంథమైన
పవిత్ర ఖురాన్
ఏకాగ్రతతో పఠిస్తాం ప్రభూ !
జీవన గమనంలో
జ్ఞాన జ్యోతుల్ని
వెలిగించండి అల్లాహ్!
ఉపవాసమే దీక్షగా
దానధర్మాలే ధ్యేయంగా
మీ సేవలో తరిస్తాం ప్రభూ
మీరు నేర్పిన మానవీయతే
అభిమతంగా చరిస్తాం అల్లాహ్!
తుది వరకూ
మీ అండదండలు
మాకు ప్రసాదించండి ప్రభూ !
రంజాన్ నెల మాకు స్ఫూర్తి !
మమ్మల్ని నడిపించే
మార్గదర్శి!
వై .సుజాత ప్రసాద్, 9963169653
- Advertisement -



