తల్లి, తండ్రి తర్వాత ఉపాధ్యాయుడికే ఉత్కష్టమైన స్థానం అందించబడినందుకే మాతదేవోభవ, పితదేవోభవ, ఆచార్య దేవోభవ అనే సంస్కృత సూక్తి మనకు తెలిసిందే.
స్వామి వివేకానందని విశ్వవిజేతగా నిలబెట్టడానికి ప్రధాన కారణం గురువు రామకష్ణ పరమహంసయే కదా. అంబేద్కర్‌లో జిజ్ఞాస రగిలించి గొప్ప విద్యా వంతుణ్ణి చేసింది గురువులే కదా. కలాం ను కూడా మిస్సైల్ మ్యాన్ గా నిలిపింది గురువులే కదా. గురువు అంటే శిలను శిల్పంగా మలిచే శక్తి. గురువంటే ఒక అనంతశక్తి. విద్యార్థులలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని అందించే సమున్నతమైనటువంటి బాధ్యత గురువుది. గురుబి శబ్దంలో ‘గు’ అంధకారాన్ని సూచిస్తుంది. ‘రు’ అంధకారాన్ని నిరోధిస్తుంది.
గురువు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఉత్తమ గురువు కేవలం బోధించడు. తన అనుభవమును మొత్తం రంగరించి తన ప్రవర్తన, పరిచర్యలు, ప్రయోగాల ద్వారా సన్నివేశాలను కల్పించడం ద్వారా విద్యార్థుల్లో దృష్టిలో జిజ్ఞాసను రగిలిస్తాడు. పాఠ్యపుస్తకాలతో బోధన సరి పుచ్చుకోకుండా పిల్లల్లో ఉన్న సజనాత్మకత శక్తిని వెలికి తీస్తాడు గ్రేట్ టీచర్.
తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువ కవి, అవధాని, పాఠ్యపుస్తక రచయిత, అవుసుల భాను ప్రకాష్ గారు చేసిన మరో ప్రయత్నమే ఈ ‘గ్రేట్ టీచర్’. భాను ప్రకాష్ గారు పద్యసారస్వత పీఠంబి తెలంగాణ పేరుతో ఎన్నో రకాలైన సాహితీ కార్యక్రమాలు చేస్తున్నారు ఈయన నామధేయం అందరికీ సుపరిచితమే.
ఉపాధ్యాయులందరికీ గొప్ప టీచర్ గా ఎదగడానికి మనకు మనం మనలో ఉన్న లోటుపాట్లను సరి చేసుకుంటూ నిరంతర విద్యార్థిగా పుస్తక పఠన చేస్తూ విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దే శక్తి మనలో ఉందంటాడు రచయిత గారు. ఈ గ్రేడ్ టీచర్ పుస్తకంలో 14 అంశాలతో ఉపాధ్యాయుడిలో మంచి లక్షణాలను సరళంగా విపులుకరించాడు రచయిత. ఉపాధ్యాయుడు తన మూర్తిమత్వాన్ని పెంపొందింపజేసుకొని, జ్ఞానంలో అందనంత ఎత్తుకు ఎదిగి ,విద్యార్థి మానసిక స్థాయికి దిగి వాడి అభిరుచికి తగ్గట్టుగా బోధన చేయడమే నిజమైన బోధనంటాడు కవి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన నేటి కాలంలో వాటి ప్రభావం ఎంత ఉన్నా కూడా విద్యార్థిని అద్భుతంగా ప్రభావితం చేయగలిగింది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే .అది డిజిటల్ పాఠమైన, ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్ అయిన, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అయినా, బోధన ఉపకరణాలే తప్ప ఏమాత్రం ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కావు.
తరగతి గదిలోకి ప్రవేశించిన ఉపాధ్యాయుడు తన మాటలతో చలక్తులతో విద్యార్థులను మంత్రముగ్ధుల్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్యం నుండే విలువలతో కూడిన జీవన విధానాన్ని పిల్లలకు ఉపాధ్యాయుడు అందిస్తే భావి భారత పౌరులుగా నిలదొక్కుకుంటారు. విలువలు వ్యక్తి యొక్క స్థాయిని నిర్దేశిస్తాయి విలువలతో కూడిన జీవన విధానమే అత్యున్నత జీవన విధానంగా భావించబడుతున్నది. ఇలాంటి చక్కటి విషయాలను ఈ” గ్రేట్ టీచర్ ”పుస్తకంలో వివరించబడినవి . ఇది ప్రతి ఒక్కరు చదువదగ్గ గ్రంథమే.
ప్రధానోపాధ్యాయుడు ఇటు బడికి అటు ప్రభుత్వానికి సంధానకర్త ఈ రెండింటిని సమన్వయంతో ముందుకు నడిపించే వ్యూహకర్త అంటాడు రచయిత. 21వ శతాబ్దపు నైపుణ్యాలను నాయకత్వ పట్టిమను వంట పట్టించుకున్న ప్రధానోపాధ్యాయులు ఎంతోమంది తమ బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు మరి ఇలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలను స్మరణ చేసుకోవాలంటాడు ఈ గ్రంథంలో .
పిల్లలలో పేరుకుపోయిన వెనక బాటుతనాన్ని దూరం చేయడానికి వేరే వేరే నైపుణ్యాలు కలిగి ఉన్న విద్యార్థులను వారి ఆసక్తులను గమనించి వారిలో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయుడు వెలికి తీసి సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పిల్లల్లో దాగి ఉన్న సజనాత్మకతను ఉపాధ్యాయులుగా మనం ప్రోత్సహించి, మెరుగులు దిద్దితే, విద్యార్థి చరవాణి వినియోగం నుండి దృష్టి మరలచే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది . ఇది నేటి కాలపు విద్యార్థులకు తప్పనిసరి.
అల్పాహారం చేయడం శరీరానికి ఎంత అవసరమో పుస్తక పఠనం చేయడం మనసుకి అంతే అవసరం అల్పాహారం దేహానికి శక్తినిస్తే అధ్యయనం మనసుకు పుష్టిని ఇస్తుంది . పుస్తక అధ్యయనానికి తొలిమెట్టు పఠనమే.
ఇలా యువ కవి అవధాని భాను ప్రకాష్ గారు ఉపాధ్యాయుడు తనకు తాను గొప్పవాడుగా, ఎదగడానికి ఇంకా మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి కొత్త బోధనా విధానాలతో విద్యార్థులనాకర్షించి బోధనలో వినూత్నమైన పద్ధతులను పాటించాలనీ చెబుతాడు.గ్రేట్ టీచర్ గా ఈ సమాజానికి కనపడాలంటే ఈ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాల్సిందే . ఈ పుస్తకంలో చెప్పిన 14 అంశాలన్నీ కూడా వాస్తవానికి దగ్గరలో ఉన్నాయి .ఈ పుస్తకం చదివితేనే గ్రేట్ టీచర్ అని నేను అనను కానీ ,ఇంకా గొప్ప వాళ్ళుగా తమకు తాము స్వీయంగా నిర్మించబడతారనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడి చేతిలో ఉండాల్సిన పుస్తకం గ్రేట్ టీచర్. ఇందులోని ప్రతి అక్షరం ఉపాధ్యాయుడిలో ఒక గొప్ప శక్తిని పునరుత్తేజాన్ని కలిగిస్తుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
పుస్తకం ముఖచిత్రం అబి అంటే అర్థం చేయించడం ఆబి అంటే ఆలోచింప చేయడం వంటి ఉప శీర్షికతో ”గ్రేట్ టీచర్” గా శీర్షిక ఎంపిక చేయడం చాలా బాగుంది. పుస్తక ముఖ చిత్రాన్ని చూడగానే తప్పకుండా చదవాలనే ఆకాంక్షను రేకెత్తించడం అభినందనీయం.
చంద్రకాంత్ గౌడ్, 9441762105


