Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంక్విట్‌ ఇండియా స్ఫూర్తితో

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో

- Advertisement -

13న దేశవ్యాప్త ఉద్యమం
ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఆగస్టు 13న దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్టు ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పేర్కొన్నారు. నాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ దేశాన్ని దోచుకుతింటే, నేడు కార్పొరేట్‌ ఇండియా దేశ సంపదను దోచుకుతింటుందని విమర్శించారు. మరోవైపు అమెరికా టారిఫ్‌తో బెదిరించి, దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో అమెరికా టారిఫ్‌లను, కార్పొరేటర్లు దోపిడీని అరికట్టాలని, ఓడించాలని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు. మంగళవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ ఎంపీ, ఏఐఎడబ్ల్యూయూ ఉపాధ్యక్షులు వి.శివదాసన్‌, బీకెేఎంయూ నేత విఎస్‌ నిర్మల్‌, ఎఐఎఆర్‌ఎల్‌ నేతలు నివాస్‌, ఆర్‌ఎస్‌ డాగర్‌, ఎఐఎస్‌కెఎస్‌ నేత డికె వర్మలతో కలిసి బి.వెంకట్‌ మాట్లాడారు. దేశ సంపద, వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్లు ప్రజలను దోచుకుంటున్నారని, దేశ సంపదను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. కార్పొరేట్ల కండ్లు రైతుల భూములు, వ్యవసాయ ఉత్పత్తులు, మైనింగ్‌పై పడ్డాయని, అందుకే ఆగ్రో బిజినెస్‌ పేరుతో వాటిని లాక్కునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంతో నాడు బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఓడించారని, నేడు మన కార్పొరేట్‌ సంస్థలు, అమెరికా సామ్రాజ్యవాదులను ఓడించి దేశాన్ని కాపాడుకోవాలని, గ్రామ ప్రజలను రక్షించాలని పిలుపు నిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -