నవతెలంగాణ – కుభీర్
మండలంలోని పార్టీ(బి) గ్రామానికి చెందిన మడి పోశెట్టి ఆధ్వర్యంలో గ్రామ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో మంగళవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపనను ఘనంగా నిర్వహించారు. ఈ విగ్రహ ప్రతిష్టపనకు ముఖ్య అతితి గా స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ పాఠశాల ప్రాథనోపాద్యులు నారాయణ్ రెడ్డి విగ్రహనికి ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు తీసుకువచ్చి గ్రామ పేరు మరియు తల్లిదండ్రులు పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి విజయ్ కుమార్ గ్రామసర్పంచ్ ప్రవీణ్ నాయకులు చిమ్మన్ పోశెట్టి వడ్ల రాజన్న బీజ్జం సంతోష్ నారాయణ్, గణేష్ యువకులు ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.
ఫార్డి (బి )లో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



