– గ్రామంలో పరిపాలన సౌలభ్యం కోసం బోర్డుల ఏర్పాటు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామంలో ఆయా వీధులకు నంబర్లతో కూడిన బోర్డులను మంగళవారం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వూరే నీలవేణి దశరథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో మొత్తం 14 వీధులు ఉండగా ప్రతి వీధికి వరుస నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ఆయా వీధి ప్రారంభమయ్యే చోట ఆ వీధి నంబర్ తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల సూచనల మేరకు గ్రామంలో పరిపాలన సౌలభ్యం కోసం వీధులకు నంబర్ బోర్డులను ఏర్పాటు చేసామన్నారు. వీధులకు నంబర్ బోర్డుల ఏర్పాటు వల్ల ఇతర ప్రాంతాల వారికి గ్రామస్తులు తమ ఇంటి అడ్రస్ తెలిపేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టే పారిశుద్ధ్య, ఇతరత్రా పనులను కూడా రోజువారిగా వీధిల వారిగా వరుస క్రమంలో నిర్వహించేందుకు సౌలభ్యంగా ఉంటుందని సర్పంచ్ వూరే నీలవేణి దశరథ్ తెలిపారు. గ్రామంలోని వీధులకు నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వూరే దశరత్, వార్డు సభ్యుడు తోట ప్రసాద్, హరికుప్పల సంతోష్, కొత్త లక్ష్మి నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
అమీర్ నగర్ లో వీధులకు బోర్డుల ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



