- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండలం నాయినవానికుంట తండాలో గ్రామానికి చెందిన యువ నాయకులు రమావత్ వినోద్ కుమార్ సొంత ఖర్చులతో తండాలో సీత్లాభవాని విగ్రహాన్ని సోమవారం ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా గోర్ బంజారాలు జరుపుకునే మొదటి పండుగగా శీత్లా భవాని నేడు మంగళవారం నాయిన వానికుంట తండాలో ఘనంగా జరుపు కోనున్నారు. సొంత ఖర్చులతో విగ్రహం ఏర్పాటు పట్ల తండావాసులు వినోద్ కుమార్ కు అభినందనలు తెలిపారు.
- Advertisement -