ముఖం కడుక్కోవడానికి సబ్సును ఉపయోగిస్తాం. ఇది సర్వసాధారణం. అయితే కొందరు సబ్బులతో పాటు ఫేస్ వాష్‌లను సైతం ఉపయోగిస్తారు. కానీ ఇవన్నీ ముఖంపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖానికి సహజమైన వస్తువులను ఉపయోగిస్తే మరింత మేలు జరుగుతుందని సూచిస్తుంటారు. మరి ముఖాన్ని సబ్బుకు బదులు ఉపయోగించాల్సినవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
– శనగపిండి సహజమైన క్లెన్సర్‌గా చెబుతుంటారు. ఇప్పటికే మన పెద్దవాళ్లు శనగపిండిని ఉపయోగిస్తుంటారు. ఇది చర్మం నుంచి ఆయిల్‌ను సహజంగా తొలగిస్తుంది. ఇందుకోసం పెరుగు లేదా పాలలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని కలిపి పేస్ట్‌లాగా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ముఖం నిగనిగలాడుతుంది.
– ఇక బియ్యం పిండి కూడా ముఖాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని నీళ్లలో లేదా పాలలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
– ఇక పెరుగు కూడా ముఖాన్ని సహజంగా రక్షిస్తుంది. ఇందుకోసం పెరుగును ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.
– అలోవెరా జెల్ ముఖ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి జెల్ అప్లై చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముఖంగా స్మూత్‌గా మారుతుంది.



