Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి బీమా చెక్కు అందజేత

మృతుడి కుటుంబానికి బీమా చెక్కు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – హలియా
పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బొంగరాల వెంకటయ్య ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించారు. మృతుడికి హలియా పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు లో భీమా సౌకర్యం ఉంది. దీంతో గురువారం హలియా శాఖ నందు వారి కుటుంబ సభ్యులకు న్యాయవాది గొట్టి ముక్కల నరేష్ చేతుల మీదుగా రూ.1 లక్ష చెక్కు అందజేశారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ నంద్యాల రాజేష్  మాట్లాడుతూ .. ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. తద్వారా ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు వచ్చే ప్రతిఫలం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది అకౌంటెంట్ రవీందర్ రెడ్డి, షాహిన్ ,భార్గవి, పవన్, బాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -