జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గొర్రెల, మేకలకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం ను ప్రభుత్వం కల్పించాలని కోరుతూ గొర్రెల మేకల పెంపకదార్ల సంఘం జిల్లా కార్యదర్శి దయ్యాల నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భువనగిరి మండలంలోని ముస్తానపల్లి గ్రామంలో గురువారం రాత్రి కారు ప్రమాదంలో సుమారు 15 గొర్రెలు మృత్యువాత పడగా, మరో 10 గొర్రెలు గాయాల పాలయ్యాయి. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన జింపియస్ మండల కమిటీతో కలిసి, గ్రామానికి వెళ్లి, సంఘ నాయకులతో కలిసి గాయపరిచిన కారు యజమానితో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వడ్డే బీరప్ప కుటుంబానికి సుమారు రెండు లక్షల 25 వేల రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించారు.
గొర్రెల మేకల సంబంధించిన డాక్టర్ను పిలిపించి గాయపడిన గొర్రెలను ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు గొర్రెల మేకలకు, గొర్రెల మేకల పెంపకం దారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ సౌకర్యం ఉండేదని, గత బిఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెల మేకల పెంపొందారులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలా సందర్భాల్లో గొర్రెల మేకలు మేత కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయని, అక్కడక్కడ పెంకుందారులపై దాడులు సైతం జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గొర్రెల మేకల పెంకుందారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పాక జహంగీర్, మండల సహాయ కార్యదర్శి వడ్డే జమదగ్ని, సంఘ నాయకులు వడ్డే రమేష్, వడ్డే అంజయ్య, వడ్డే కొమురయ్య, లక్ష్మయ్య , మల్లయ్య శ్రీశైలం, వడ్డే పాండు వడ్డే నరేష్,గౌతం గ్రామ పెద్దలు పాల్గొన్నారు..
గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES