Thursday, March 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅనాథ బాల, బాలికలకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

అనాథ బాల, బాలికలకు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

- Advertisement -

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో అనాథ బాలికలు, బాలుర కోసం రెండు స్కూళ్లను ప్రత్యేకంగా కేటాయించాలని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కోరారు. బుధవారం శాసనమండలిలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా ఉందని విమర్శించారు. 3 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం చేరేందుకు ప్రతి ఏటా 14 శాతం వద్ధిని సాధించాలనీ, రూ.85 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమనీ, అది సాధ్యం కాదన్నారు. హైడ్రా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. 5 వేలకు పైగా ఐటీ ఉద్యోగులు ఏడాదిలో తగ్గిపోయినట్టు గవర్నర్‌ ప్రసంగంలోని లెక్కల ద్వారా తెలుస్తుందన్నారు. రాష్ట్ర జనాభా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కో విధమైన లెక్కలు చెబుతున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారనీ, ఇక మిగిలిన జనాభా 16 లక్షలేనని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -